Daryl Mitchell | న్యూజిలాండ్ స్టార్ ఆడ్రౌండర్కు గాయం.. ఐపీఎల్‌కు దూరమయ్యేనా..?
Daryl Mitchell : దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో మిచెల్ బొటన వేలి...
Daryl Mitchell : దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో మిచెల్ బొటన వేలి(Toe Injury)కి గాయమైంది. దాంతో మేనేజ్మెంట్ అతడి విశ్రాంతినిచ్చింది. కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టనుంది.
దాంతో, ఈ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఆడ విల్ ఒ రూర్కీ స్క్వాడ్‌లో కలువనున్నాడు. అయితే.. రెండో టెస్టుకు మిచెల్ స్థానంలో విల్ యంగ్‌ను ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘మూడు ఫార్మాట్ల స్క్వాడ్‌లో మిచెల్ ఎంతో కీలకమైన ఆటగాడు. ఈ ఏడాది షెడ్యూల్ దృష్ట్యా అతడు రిహాబిలిటేషన్‌లో ఎక్కువ సమయం గడిపేందుకు అనుమతిస్తున్నాం. తర్వాతి మ్యాచులకు అతడు పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం’ అని హెడ్‌కోచ్ గ్యారీ స్టీడ్ ఓ ప్రకటనలో తెలిపాడు.
A long-term foot injury forces Daryl Mitchell out of New Zealand’s next four games; aims for recovery before the Australia Tests
👉 https://t.co/CKxePuoS7l pic.twitter.com/li0V1b0wSV
— ESPNcricinfo (@ESPNcricinfo) February 8, 2024
అంతేకాదు ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు కేన్ విలియమ్సన్ కూడా దూరమయ్యే అవకాశం ఉందని స్టీడ్ చెప్పాడు. ‘కేన్ భార్య ఇప్పుడు గర్భవతి. టీ20 సిరీస్ సమయానికి అతడు ఆమెతో ఉంటాడు. ఈ సిరీస్ కోసం స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్‌ను తీసుకుంటాం’ అని స్టీడ్ వెల్లడించాడు.
డారిల్ మిచెల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ముందు మిచెల్ గాయపడడం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు పెద్ద షాకే. ఎందుకంటే..? మిడిలార్డర్లో దంచికొట్టే మిచెల్.. బంతితోనూ మాయ చేయగలడు. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో అతడు టీమిండియాపై సెంచరీ బాదాడు. దాంతో దుబాయ్‌లో జరిగిన మినీ వేలంలో చెన్నై అతడిని రూ. 14 కోట్లకు కొన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- David Miller | టీ20ల్లో మిల్లర్ విధ్వంసం.. 10 వేల రన్స్ కొట్టిన సఫారీ చిచ్చరపిడుగు
- Tollywood | బడ్జెట్ కారణంగా ఆగిపోతున్న భారీ సినిమాలు.. మొహమాటం వదిలేస్తున్న నిర్మాతలు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

