David Miller | టీ20ల్లో మిల్లర్ విధ్వంసం.. 10 వేల రన్స్ కొట్టిన సఫారీ చిచ్చరపిడుగు
David Miller : పొట్టి క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్(David Miller) రికార్డు సృష్టించాడు. 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. స్వదేశంలో జరుగుతున్న ఎస్ఏ20(SA20) రెండో సీజన్లో మిల్లర్ ఈ ఫీట్ సాధించాడు. పార్ల్ రాయల్స్(Paarl Royals)కు ఆడుతున్న మిల్లర్ బుధవారం...
David Miller : పొట్టి క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్(David Miller) రికార్డు సృష్టించాడు. 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. స్వదేశంలో జరుగుతున్న ఎస్ఏ20(SA20) రెండో సీజన్లో మిల్లర్ ఈ ఫీట్ సాధించాడు. పార్ల్ రాయల్స్(Paarl Royals)కు ఆడుతున్న మిల్లర్ బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మిల్లర్ 47 రన్స్ కొట్టాడు. దాంతో టీ20ల్లో పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా మిల్లర్ చరిత్రపుటల్లోకెక్కాడు.
ఈ ఫీట్‌తో అతడు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ()ల సరసన చేరాడు. మొత్తంగా ఈ ఫార్మాట్లో 10 వేల రన్స్ కొట్టిన 12 క్రికెటర్‌గా ఈ చిచ్చరపిడుగు గుర్తింపు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక రన్స్ కొట్టిన సఫారీ క్రికెటర్లలో మిల్లర్ అగ్రస్థానంలో నిలవగా.. మాజీ కెప్టెన్ డివిలియర్స్ (AB de Villiers ) ఫాఫ్ డూప్లెసిస్(Faf du Plessis)లు 9 వేల పరుగులు సాధించారు.
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ

పొట్టి క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన 12 మందిలో క్రిస్ గేల్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ మాజీ విధ్వంసక ఓపెనర్ ఖాతాలో 14,562 రన్స్ ఉన్నాయి. పాక్ మాజీ ఆల్‌రౌండర్ 13,077 రన్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కీరన్ పోలార్డ్(12,577), అలెక్స్ హేల్స్(12,002), విరాట్ కోహ్లీ(11,994), డేవిడ్ వార్నర్(11,860), అరోన్ ఫించ్(11,458), రోహిత్ శర్మ(11,156), జోస్ బట్లర్(11,146), కొలిన్ మన్రో(10,602), జేమ్స్ విన్సే(10,019)లు పది వేల పరుగుల వీరుల జాబితాలో ఉన్నారు.

విధ్వంసక ఇన్నింగ్స్‌కు పెట్టింది పేరైన మిల్లర్ టీ20 లీగ్స్‌లో దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఎస్ఏ 20లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న మిల్లర్ 16వ సీజన్లో దంచికొట్టాడు. 16 మ్యాచుల్లో 259 రన్స్ కొట్టాడు. నిరుడు గుజరాత్ ఫైనల్ చేరినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
- Shloka Mehta | మనీశ్ మల్హోత్ర చీరలో మెరిసిన శ్లోకా మెహతా.. పిక్స్ వైరల్
- Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రచారకర్తగా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

