న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో.. బ్రిటన్‌కు చెందిన డేనియల్ ఇవాన్స్ స్టన్నింగ్ విక్టరీ కొట్టాడు. అయిదు గంటల 35 నిమిషాల పాటు ఆ మ్యాచ్ సాగింది. యూఎస్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘ మ్యాచ్‌గా నిలిచింది. 6-7 (6/8), 7-6 (7/2), 7-6 (7/4), 4-6, 6-4 స్కోరుతో ఇవాన్స్ విజయం నమోదు చేశాడు. రష్యాకు చెందిన కారెన్ ఖచానోవ్పై అతను విక్టరీ సాధించాడు. ఇది చాలా సుదీర్ఘమైన పోరాటమని ఇవాన్స్ తెలిపాడు. మ్యాచ్ ఆద్యాంతం అద్భుతంగా ఆడానని పేర్కొన్నాడు. చివరి సెట్లో ఓ దశలో 0-4తో వెనుబడి ఉన్న ఇవాన్స్ అనూహ్య రీతిలో విజృంభించాడు. ఆ సెట్లో నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన ఇవాన్స్ జోరును ప్రత్యర్థి అడ్డుకోలేకపోయాడు. ఆర్థిర్ ఆషే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రతి పాయింట్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు. ప్రతి సెట్ గంట సమయం దాటింది. మూడవ సెట్ మాత్రం అత్యధికంగా 72 నిమిషాలు తీసుకున్నది.
5 HOURS AND 35 MINUTES!!!
Take a bow, Dan Evans and Karen Khachanov 👏 pic.twitter.com/noiPnkVDGU
— US Open Tennis (@usopen) August 27, 2024