ఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ టైటిల్‌ను దబాంగ్ ఢిల్లీ కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడి త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ.. 31-28తో పూణేను ఓడించి తమ కెరీర్లో రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగిన ఢిల్లీ.. ఫస్టాఫ్‌లోనే 20-14తో నిలిచి గెలుపు దిశగా సాగింది.
సెకండాఫ్ మొదలయ్యాక ఒకదశలో పూణే పుంజుకుని 28-30తో పోరు రసవత్తరంగా మారినా ఆఖర్లో ఢిల్లీ అద్భుతమైన డిఫెన్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 9 పాయింట్లతో ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ ఆసాంతం రాణించిన నవ్‌దీప్ బెస్ట్ డిఫెండర్‌గా ఎంపికవగా అయాన్ (పాట్నా) బెస్ట్ రైడర్ అవార్డు గెలుచుకున్నాడు. ఢిల్లీకే చెందిన ఫజెల్ ఈ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. విజేతలుగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.