అహ్మదాబాద్: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో దబాంగ్ ఢిల్లీ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం మొదలైన లీగ్‌లో మాజీ చాంపియన్ ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో జైపూర్ పాట్రియాట్స్‌పై 11-4 తేడాతో ఘన విజయం సాధఙంచింది. పురుషుల సింగిల్స్ తొలి గేమ్‌లో క్వెక్ ఇజాక్ 2-1తో కనాక్ జాపై గెలిచి ఢిల్లీకి శుభారంభం అందించాడు. అయితే మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ ఆకుల శ్రీజ 2-1తో మారియ జావోపై గెలిచి జైపూర్‌ను పోటీలోకి తీసుకొచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఢిల్లీ జోడీ సాతియాన్ జ్ఞానశేఖరన్, జావో 3-0తో శ్రీజ, జా ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో జ్ఞానశేఖరన్ 3-0తో జీత్ చంద్రను చిత్తు చేశాడు. దీంతో ఢిల్లీ విజయం ఖరారైంది.