హైదరాబాద్, ఆట ప్రతినిధి: విజయపుర(కర్ణాటక) వేదికగా జరుగుతున్న 28వ జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సైక్లిస్టులు అదరగొట్టారు. శుక్రవారం జరిగిన వేర్వేరు విభాగాల్లో చిరాయుశ్ పట్వర్ధన్, ఆశీర్వాద్ సక్సేనా పతకాలు సాధించారు. బాలుర అండర్-18 80కి.మీల రేసులో చిరాయుశ్ 1:59:27:810 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో పోటీపడ్డ ఆశీర్వాద్(1:59:27:83సె) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనచరిచిన యువ సైక్లిస్టులు చిరాయుశ్, ఆశీర్వాద్‌ను తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఒక ప్రకటనలో అభినందించింది. విజయ్‌కుమార్‌రెడ్డి, వెంకట నర్సయ్య, దివాకర్‌రావు, పండుజాదవ్..టోర్నీలో తెలంగాణ సైక్లింగ్ టీమ్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు.