CWG 2022 | కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల వేట.. ఎలా సాగిందంటే?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. మొత్తం 72కుపైగా దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా భారత స్వర్ణ పతకాల వేటను వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానునే ప్రారంభించింది. మహిళల 49 కేజీల విభాగంలో ఆమె తొలి పసిడిని ముద్దాడింది. చివరగా టేబుల్ టెన్నిస్‌లో వెటరన్ శరత్ కమల్ స్వర్ణంతో ఈ పతకాల వేట ముగిసింది.
ఎన్నో అంచనాలతో బరిలో దిగిన భారత పురుషుల హాకీ జట్టు, మహిళల క్రికెట్ జట్టు సిల్వర్ మెడల్స్‌తో సరిపెట్టుకున్నాయి. మహిళల హాకీ జట్టు కాంస్యం సాధించింది. బ్యాడ్మింటన్‌లో చివరి రోజైన సోమవారం నాడు మూడు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. మొత్తమ్మీద భారత క్రీడాకారులు 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించారు.
బంగారు కొండలు..(22)
రెజ్లింగ్ (6):
నవీన్ కుమార్, వినేష్ ఫోగట్, రవి కుమార్ దహియా, దీపక్ పూనియా, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా
వెయిట్ లిఫ్టింగ్ (3):
అచింత షూలీ, లాల్రినుంగ జెరెమీ, మీరాబాయి చాను
టేబుల్ టెన్నిస్ (4):
శరత్ కుమార్ ఆచంట, మిక్స్డ్ డబుల్స్ (శరత్, శ్రీజ ఆకుల), భవీనా పటేల్ (మహిళల సింగిల్స్ క్లాసెస్ 3-5), పురుషుల టీం (హర్మీత్ దేశాయ్, సనీల్ శెట్టి, శరత్ కమల్ ఆచంట, సాతియాన్ జ్ఞానశేఖర్)
పారా పవర్‌లిఫ్టింగ్:
సుధీర్
లాన్ బౌల్స్:
మహిళల ఫోర్స్ (లవ్లీ చౌబే, రూపా రాణీ, పింకీ, నయన్మోని సైకా)
బాక్సింగ్ (3):
నిఖత్ జరీన్, అమిత్ పంఘాల్, నీతూ ఘంఘాస్
బాడ్మింటన్ (3):
పురుషుల డబుల్స్ (సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టి), లక్ష్యసేన్, పీవీ సింధు
అథ్లెటిక్స్:
ఎల్డ్‌హోస్ పాల్
వెండి పతకాలు.. (16)
అథ్లెటిక్స్ (4):
అబ్దుల్లా అబూబకర్, అవినాష్ ముకుంద్, ప్రియాంక, శ్రీశంకర్,
బాడ్మింటన్:
మిక్స్డ్ టీం ఈవెంట్ (కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ రెడ్డి, సుమీత్ రెడ్డి, లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్, మచిమండ పొన్నప్ప, పుల్లెల గాయత్రి, పీవీ సింధు)
బాక్సింగ్:
సాగర్ అహ్లావత్
క్రికెట్:
మహిళల టీం
హాకీ:
పురుషుల టీం
జూడో (2):
తులికా మాన్, సుశీలా దేవి
లాన్ బౌల్స్:
పురుషుల ఫోర్స్ టీం
టేబుల్ టెన్నిస్:
పురుషుల డబుల్స్ (శరత్ కమల్, సాతియాన్ జ్ఞానశేఖరన్)
వెయిట్ లిఫ్టింగ్ (3):
వికాస్ ఠాకూర్, బింద్యారాణి దేవి, సంకేత్ మహాదేవ్ సర్గార్
రెజ్లింగ్:
అన్షు మాలిక్
కాంస్య విజేతలు..(23)
రెజ్లింగ్(5):
దీపక్ నెహ్రా, పూజా సిహాగ్, పూజా గెహ్లాట్, మోహిత్ గ్రెవాల్, దివ్య కక్రాన్
వెయిట్‌లిఫ్టింగ్ (4):
గుర్దీప్ సింగ్, లవ్‌ప్రీత్ సింగ్, హర్జీందర్ కౌర్, గురురాజ పూజారి
టేబుల్ టెన్నిస్ (2):
సాతియాన్ జ్ఞానశేఖరన్, సోనాల్బేన్ మనుభాయి పటేల్
స్క్వాష్ (2):
మిక్స్డ్ డబుల్స్ (దీపికా పల్లికల్, సౌరవ్ ఘోసల్), సౌరవ్ ఘోసల్
జూడో:
విజయ్ కుమార్ యాదవ్
హాకీ:
మహిళల టీం
బాక్సింగ్ (3):
రోహిత్ టోకాస్, హుస్సాముద్దీన్ మహమ్మద్, జాస్మిన్ లంబోరియా
బాడ్మింటన్ (2):
మహిళల డబుల్స్ (జాలీ ట్రీసా, పుల్లెల గాయత్రి), కిదాంబి శ్రీకాంత్
అథ్లెటిక్స్:
అన్ను రాణి, సందీప్ కుమార్, తేజస్విన్ శంకర్
🇮🇳👏 𝐌𝐀𝐃𝐄 𝐔𝐒 𝐏𝐑𝐎𝐔𝐃! Congratulations to all the athletes who represented & won medals for us at the 2022 Commonwealth Games.
💪 We finish 4th this year with 6️⃣1️⃣ medals.
📸 Getty • #B2022 #CWG2022 #TeamIndia #BharatArmy pic.twitter.com/yRQAuF8VDM
— The Bharat Army (@thebharatarmy) August 8, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

