చెన్నై : వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బొటనవేలి గాయం కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అక్టోబర్ 18న అఫ్గానిస్థాన్, 22న భారత్, 28న దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ అందుబాటులో ఉండకపోవచ్చు.
బంగ్లాదేశ్‌పై సాధికార ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ అర్ధ శతకం(78)తో జట్టును గెలుపు వాకిట నిలిపాడు. అయితే.. పరుగు తీసే క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి అతడి ఎడమ బొటన వేలికి బలంగా తాకడంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. అనంతరం కొద్దిసేపటికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.