CWC 2023: వన్డే ప్రపంచకప్‌లో ఆడిన తొమ్మిదింటిలో తొమ్మిది విజయాలు సాధించి భారత్‌ను సెమీస్‌కు చేర్చిన రోహిత్ శర్మకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ షాకిచ్చింది. రోహిత్‌ను కాదని మాజీ సారథి విరాట్ కోహ్లీకి సారథ్య పగ్గాలు అప్పజెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటి..? భారత క్రికెట్ జట్టుతో ఆస్ట్రేలియాకు ఏం సంబంధం అనుకుంటున్నారా..? సీఏ ఎంపికచేసింది భారత జట్టును కాదు.. వరల్డ్ కప్ లెవెన్ (టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్-2023) కు సంబంధించిన డ్రీమ్ టీమ్. భారత్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా.. వరల్డ్ కప్ లెవన్‌ను ప్రకటించింది. దానికి విరాట్‌ను సారథిగా చేసిన సీఏ.. ఆ జట్టులో రోహిత్‌కు కెప్టెన్‌గానే గాక ఆటగాడిగా కూడా చోటు కల్పించకపోవడం గమనార్హం.
విరాట్ కోహ్లీని సారథిగా చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. భారత్ నుంచి బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలను కూడా ఎంపిక చేసింది. వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్‌కు అవకాశమిచ్చింది. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రతో పాటు సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్, లంక యవ పేసర్ దిల్షాన్ మధుశంకలకూ అవకాశం కల్పించింది. ఈ లంక పేసర్‌ను 12వ ఆటగాడిగా ఎంపిక చేసింది. టోర్నీలో నిలకడగా రాణించిన కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిదీలకూ సీఏ అవకాశమివ్వలేదు.
Cricket Australia picks the “Team of the World Cup 2023”:
De Kock, Warner, Rachin, Kohli (C), Markram, Maxwell, Jansen, Jadeja, Shami, Zampa, Bumrah, Madushanka (12th man) pic.twitter.com/K1u96Cqcz1
— Johns. (@CricCrazyJohns) November 13, 2023
క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్..
క్వింటన్ డికాక్
డేవిడ్ వార్నర్
రచిన్ రవీంద్ర
విరాట్ కోహ్లీ
ఎయిడెన్ మార్క్రమ్
గ్లెన్ మ్యాక్స్‌వెల్
మార్కో జాన్సెన్
రవీంద్ర జడేజా
మహ్మద్ షమీ
ఆడమ్ జంపా
జస్ప్రిత్ బుమ్రా
దిల్షాన్ మధుశంక (12వ ఆటగాడు)