Pat Cummins : యాషెస్ సిరీస్ చివరి టెస్టుతో ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) కెరీర్ ముగియనుంది. జనవరి 4న మొదలయ్యే సిడ్నీ టెస్టు (Sydney Test)కు ముందే మీడియాతో తన వీడ్కోలు వార్తను పంచుకున్నాడీ ఓపెనర్. చివరిసారిగా ఆస్ట్రేలియా జెర్సీ వేసుకోనున్న ఖవాజాకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) అభినందనలు తెలిపాడు. ఆసీస్ విజయాల్లో కీలకమైన ఈ లెఫ్ట్ హ్యాండర్ సుదీర్ఘ కెరీర్‌పై సంతోషం వ్యక్తం చేసిన ప్యాటీ ప్రత్యేకమైన అభ్యర్థన చేశాడు.
ఓపెనర్‌గా ఆస్ట్రేలియా సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ ఖవాజా శుక్రవారం భావోద్వేగంతో వీడ్కోలు వార్తను ప్రకటించాడు. తన సొంత మైదానమైన సిడ్నీలో అతడు చిట్టచివరి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడికి ఓ రిక్వెస్ట్ చేశాడు. ‘అద్భుతమైన కెరీర్ కొనసాగించినందుకు అభినందనలు. సొంతగడ్డపై చివరగా ఒక్క సెంచరీ కొట్టు’ అని ప్యాటీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఖవాజాతో ఉన్న ఫొటో పెట్టాడు. 2011లో సిడ్నీలో ఇంగ్లండ్‌పైనే తొలి టెస్టు ఆడిన ఖవాజా ఆ జట్టుతోనే ఆఖరిసారి తలపడుతున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను పట్టేసిన ఆసీస్ .. సిడ్నీలో విజయంతో ఖవాజాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకుంటోంది.
Captain. Teammate. Respect. ❤️
Pat Cummins to Usman Khawaja 🏏#PatCummins #UsmanKhawaja #TestCricket #AussieCricket pic.twitter.com/AzodEudWr0— Cricadium (@Cricadium) January 2, 2026
సిడ్నీలో ఖవాజాకు మెరుగైన రికార్డుంది. ఇక్కడ 14 ఇన్నింగ్స్‌ల్లో 87.5 సగటుతో 875 రన్స్ సాధించాడీ ఓపెనర్. ఇందులో నాలుగు సెంచరలు, ఒక అర్ధ శతకం ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం ఇక్కడే యాషెస్ సిరీస్(2021-22)లో వరుసగా రెండు సెంచరీలతో మెరిశాడు ఖవాజా. 2023లో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేయడంలో అతడిది కీలక పాత్ర. ఆ సిరీస్‌లో 496 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు ఖవాజా.
pat cummins stop champagne 🍾 celebrations for usman khawaja. Whole team sacrificed the way they celebrate for decades just for you @Uz_Khawaja and your so called religion! you ungrateful prick🤬 stop being victim Usman khawaja and be grateful what you have. pic.twitter.com/Ml7hDo9Qfj
— @bh! (@abhiab71) January 2, 2026
అయితే.. 2024 నుంచి అతడు ఫామ్ కోల్పోయాడు. సహచరుడు డేవిడ్ వార్నర్ (David Warner) వీడ్కోలు ప్రభావంతో కాబోలు మునపటిలా శుభారంభాలు ఇవ్వలేదు. మొత్తంగా 19 మ్యాచుల్లో ఒక సెంచరీ, మూడు ఫిఫ్టీలు కలిపి 1,029 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడీ లెఫ్ట్ హ్యాండర్. పెర్త్ టెస్టులో వెన్నునొప్పి వేధించడం, ట్రావిస్ హెడ్ (Travis Head) ఓపెనర్‌గా హిట్టవ్వడం, వయసు 39కి చేరడం కూడా ఖవాజాను వీడ్కోలు నిర్ణయం తీసుకునేలా చేశాయి. వీడ్కోలు ప్రకటనలో ఖవాజా తాను జాత్యహంకారానికి గురైనట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.