IPL 2025 : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. తన మొదటి ఓవర్లోనే డేంజరస్ క్వింటన్ డికాక్(1) వికెట్ పడగొట్టాడు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. లెగ్ సైడ్ భారీ షాట్ ఆడగా జీషన్ అన్సారీ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, ఆతిథ్య జట్టు 14 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లో.. సునీల్ నరైన్(7)ను షమీ వెనక్కి పంపాడు. నరైన్ ఆడిన బంతిని వికెట్ కీపర్ క్లాసెన్ కుడివైపు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం కెప్టెన్ అజింక్య రహానే(21), అంగ్క్రిష్ రఘువంశీ(16)లు ధాటిగా ఆడుతున్నారు.
కమిన్స్, షమీల విజృంభణతో 16 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరడంతో కోల్‌కతా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే.. కెప్టెన్ రహానే భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును నడిపిస్తున్నాడు. కమిన్స్ ఓవర్లో సిక్సర్ బాదిన అతడు.. షమీ బౌలింగ్‌లో 6, 4 కొట్టాడు.
Pacers’ Delight ☝☝
Pat Cummins and Mohd. Shami dismiss the #KKR openers to give #SRH a perfect start 🔥
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @SunRisers pic.twitter.com/PsH0xDnfGz
— IndianPremierLeague (@IPL) April 3, 2025
ఇక ఆరో ఓవర్లో రెచ్చిపోయిన రహానే(21).. సిమర్జిత్ సింగ్ వేసిన రెండో బంతిని అలవోకగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఆఖరి బంతిని ఫైన్‌లెగ్ దిశలో సిక్సర్‌గా మలిచిన రుఘువంశీ జట్టు స్కోర్ 50 దాటించాడు.
6 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 53-2