చెన్నై సూపర్ కింగ్స్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (17), మొయీన్ అలీ (3) కీలక వికెట్లు పోవడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై భారం పడింది. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప (23 నాటౌట్), శివమ్ దూబే (16 నాటౌట్) నిదానంగా ఆడుతున్నారు.
ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. దూబే కొన్ని భారీ షాట్లు ఆడుతుండగా.. ఊతప్ప వన్డే తరహా ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్ ఒక వికెట్ తీయగా.. మొయీన్ అలీ రనౌట్ అయ్యాడు.