బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (89) దంచికొట్టడానికి, శివమ్ దూబే (95 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై జట్టు 216 పరుగుల అత్యంత భారీ స్కోరు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (17), మొయీన్ అలీ (3) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
ఆ సమయంలో చాలా నెమ్మదిగా ఆడిన ఊతప్ప.. శివమ్ దూబే తోడుగా మరో వికెట్ పడనీయలేదు. వచ్చినప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ కనిపించిన శివమ్ దూబే.. రెండొదల పైగా స్ట్రైక్‌రేట్‌తో రెచ్చిపోయాడు. కాసేపటికి ఊతప్ప కూడా రెచ్చిపోయి ఆడాడు. వీళ్లిద్దరూ అదరగొట్టడంతో బెంగళూరు బౌలర్లు ఏమీ చేయలేక పోయారు. దానికి తోడు శివమ్ దూబే ఇచ్చిన క్యాచులను మొత్తంగా మూడు సార్లు బెంగళూరు ఫీల్డర్లు వదిలేశారు.
తనకు దక్కి ఈ జీవనదానాలను చక్కగా ఉపయోగించుకున్న దూబే.. సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. జడేజా (0) తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లలో హసరంగ 2, హాజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.
Innings Break!
A sensational 165-run partnership between Uthappa (88) and Dube (95*) guides #CSK to a total of 216/4 on the board.#RCB chase coming up shortly. Stay tuned!#TATAIPL pic.twitter.com/uOr7P60zVa
— IndianPremierLeague (@IPL) April 12, 2022