బెంగళూరు బ్యాటర్లు మైదానంలోకి వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. షాబాజ్ నదీమ్ (41) కూడా అవుటైన కాసేపటికే.. వానిందు హసరంగ (7) కూడా పెవిలియన్ చేరాడు. జడేజా వేసిన 16వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన హసరంగ.. తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి.. లాంగాన్‌లో జోర్డాన్‌కు చిక్కాడు.
ఆ తర్వాతి బంతికే రాయుడు పట్టిన అద్భుతమై క్యాచ్‌కు ఆకాష్ దీప్ (0) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 146 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన బెంగళూరు ఓటమి అంచున నిలిచింది. క్రీజులో దినేష్ కార్తీక్ ఉన్నప్పటికీ అవసరమైన రన్‌రేట్ భారీగా ఉండటంతో బెంగళూరు విజయం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.