CSK vs MI | కొంపముంచిన డీఆర్ఎస్.. కుప్పకూలిన చెన్నై.. 97 పరుగులకే ఆలౌట్
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ కుప్పకూలింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. దానికితోడు మ్యాచ్ ప్రారంభమైన కాసేపటి వరకూ కరెంట్ కోత వల్ల డీఆర్ఎస్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో డెవాన్ కాన్వే (0) డకౌట్ అయ్యాడు. డానియల్ శామ్స్ వేసిన బంతి లెగ్ స్టంప్‌ను మిస్ అయ్యేలా కనిపించినా కూడా.. డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది.
ఆ తర్వాత కాసేపటికే మొయీన్ అలీ (0), రాబిన్ ఊతప్ప (1) కూడా పెవిలియన్ చేరారు. అప్పటికి కూడా డీఆర్ఎస్ అందుబాటులో లేదు. అనంతరం డీఆర్ఎస్ వచ్చినా కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురైన రుతురాజ్ గైక్వాడ్ (7) కూడా అవుటయ్యాడు. నిలబెడతాడనుకున్న అంబటి రాయుడు (10)ను బుమ్రా అవుట్ చేశాడు. కెప్టెన్ ధోనీ (36 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
అతనికి ఎవరూ సహకారం అందించలేదు. శివమ్ దూబే (10), డ్వేన్ బ్రావో (12) కాసేపు క్రీజులో ఉన్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివర్లో టెయిలెండర్లు సిమర్జీత్ సింగ్ (2), మహీష్ తీక్షణ (0), ముకేష్ చౌదరి (4) కూడా నిలబడలేకపోయారు. దీంతో చెన్నై జట్టు 97 పరుగులకే చాపచుట్టేసింది. ముంబై బౌలర్లలో డానియల్ శామ్స్ 3, రైలీ మెరెడిత్ 2 తీయగా.. బుమ్రా, రమణ్‌దీప్ సింగ్, కుమార్ కార్తికేయ తలో వికెట్ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK vs MI
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

