అహ్మాదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)కు జరిమానా పడింది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్ పడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 89 రన్ష్ తేడాతో విజయం సాధించింది. దీంతో అయిదు సార్లు చాంపియన్ అయిన చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హత కోల్పోయింది. చెన్నై జట్టు రెండో అఫెన్స్‌గా భావిస్తూ .. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 కింద జరిమానా విధించారు. గైక్వాడ్‌కు 24 లక్షల ఫైన్ వేసినట్లు ఐపీఎల్ తన ప్రటకనలో తెలిపింది. చెన్నై జట్టులోని మిగితా సభ్యులకు, ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా 6 లక్షల జరిమానా లేదా 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించనున్నట్లు ఐపీఎల్ తన ప్రకటనలో చెప్పింది.
ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ఈ యేటి ఐపీఎల్లో ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఇచ్చిన ఆఖరి పంచ్‌కు 19వ సీజన్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన చెన్నై జట్టు గురువారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో టైటాన్స్ చేతిలో చిత్తయింది. దాంతో సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్న చెన్నై ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. మరోవైపు వరుసగా ఐదు విజయాల తర్వాత గత పోరులో కోల్‌కతా చేతిలో ఓడిన టైటాన్స్.. సీఎస్కేపై భారీ విజయంతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది.
తొలుత సాయి సుదర్శన్ (53 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లతో 84), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లతో 64), బట్లర్(27 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లతో 57 నాటౌట్), అర్ధసెంచరీలతో గుజరాత్ 20 ఓవర్లలో 229/4 స్కోరు చేసింది. అనంతరం మహ్మద్ సిరాజ్ (3/26), రబాడ (3/32), రషీద్ ఖాన్ (3/18) బౌలింగ్ దెబ్బకు సీఎస్కే 13.4 ఓవర్లలో 140 రన్స్‌కే ఆలౌటైంది. శివం దూబే (17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.