చెన్నై: ఐపీఎల్-19వ సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించిన జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)ను గాయాలు వేధిస్తున్నాయి. గాయాలకారణంగా ఇప్పటికే ధోనీ, బ్రెవిస్ మ్యాచ్‌లకు దూరమవగా తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ సేవలనూ కోల్పోయింది. తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ మొత్తానికి ఖలీల్ దూరమైనట్టు ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
చెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గురువారం హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. తలా రాక కోసం అభిమానులు భారీ సంఖ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.ఈనెల 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగేది ఆసక్తికరంగా మారింది.