IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఓపెనింగ్ జోడీ కుదరక పవర్ ప్లేలో తేలిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు దమ్మున్న కుర్రాడు దొరికాడు. తొలి మ్యాచ్‌లోనే బెదురన్నదే లేకుండా బౌండరీలతో చెలరేగాడు 20 ఏళ్ల షేక్ రషీద్ (Shaik Rashedd). 19 బంతుల్లోనే 27 రన్స్ కొట్టిన తన ఆగమనాన్ని ఘనంగా చాటాడీ యంగ్‌స్టర్. అంతేకాదు ఇప్పటివరకూ చెన్నై తరఫున ఆడిన ఓపెనర్లలో అతిచిన్న వయస్కుడిగా గుర్తింపు సాధించాడీ చిచ్చరపిడుగు.
ఇంతకు ముందు ఈ రికార్డు సామ్ కరన్(Sam Curran) పేరిట ఉండేది. ఆల్‌రౌండర్ సామ్.. 22 ఏళ్ల త132 రోజుల వయసులో సీఎస్కే ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే.. రషీద్ 20 ఏళ్ల 202 రోజులకే ఓపెనింగ్ చేసి ఈ ఇంగ్లండ్ స్టార్ రికార్డును బద్ధలు కొట్టాడు. మొదటి మ్యాచ్‌లోనే చెలరేగిన ఈ యంగ్‌స్టర్ రూపంలో సీఎస్కేకు దమ్మున్న ఓపెనర్ దొరికాడని పలువురు క్రికెటర్లు అంటున్నారు.
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఐపీఎల్‌గా మారిన షేక్ రషీద్ మన తెలుగింటి కుర్రాడే. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. చిన్నప్పుడు రషీద్ తన ఈడుపిల్లలతో గల్లీ క్రికెట్ ఆడేవాడు. అతడు బంతిని కొడితే పక్కనున్న ఇళ్ల కిటికీలు పగిలిపోయేవి. దాంతో, నువ్వు పెద్దయ్యాక నువ్వు స్టార్ క్రికెటర్ అవుతావని స్నేహితులు, బంధువులు అనేవారు. కుమారుడి ప్రతిభను గమనించిన తండ్రి షేక్ బలిషా వలీ.. ఆర్థిక కష్టాలు ఎదురైనా సరే రషీద్‌ను ప్రోత్సహించాడు. హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించాడు. కోచ్‌ల దగ్గర మెలకువలతో మరింత రాటుదేలిన రషీద్.. రంజీల్లో ఇరగదీశాడు.
A.T.R and the Rasheed meet-up hits home 🦁🫶🏼 pic.twitter.com/EJ9MgJ5WY9
— Chennai Super Kings (@ChennaiIPL) November 7, 2023
దేశవాళీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. టాపార్డర్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రాణించాడు. 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రషీద్ 37.62 సగటుతో 1,204 పరుగులు సాధించాడు. 12 లిస్ట్ ఏ మ్యాచ్‌లతో పాటు 17 టీ20ల్లో సైతం మెరుపులు మెరిపించాడీ హిట్టర్. కొంతకాలంగా నిలకడగా ఆడుతున్న రషీద్ సీఎస్కే టాలెంట్ స్కౌట్ దృష్టిలో పడ్డాడు. దాంతో, మెగా వేలంలో చెన్నై అతడిని రూ. 30 లక్షలు పెట్టి కొన్నది.
ఐపీఎల్లో తన తొలి మ్యాచ్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అంటున్న రషీద్.. లక్నోపై ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. ‘ఓపెనర్‌గా వెళ్లాల్సి రావడంతో ఒకింత నెర్వస్‌గా అనిపించింది. ఎలా ఆడాలి? అనే సందేహం మొదలైంది. అయితే.. ధోనీ, శివం దూబే నా భయాన్ని పోగొట్టారు. ప్రశాంతంగా ఉంటూ నీ స్టయిల్లో ఆడు అని ప్రోత్సహించారు. వాళ్లు చెప్పినట్టే కూల్‌గా ఉండి చెలరేగాను. ఈ ఇన్నింగ్స్‌ను నెట్ బౌలర్లకు అంకితం ఇస్తున్నా. వాళ్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు రషీద్.
14.4.2025 – #SpecialDay 💛
Blessed to be in Yellow 😇 pic.twitter.com/a9q6oITy1n
— Shaik Rasheed (@skrasheed66) April 15, 2025
ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 18వ సీజన్లో నిరాశపరచడానికి ఓపెనింగ్ సమస్య ప్రధాన కారణం. రచిన్ రవీంద్రకు తోడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే(Devan Conway)ను ప్రయత్నించగా.. అతడు సైతం దూకుడుగా ఆడలేకపోయాడు. అంతే.. పవర్ ప్లేలో 50 ప్లస్ సైతం కొట్టలేకోయింది సీఎస్కే. అంతేకాదు 180 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడుతూ వస్తోంది.
THE SHOTS OF SHAIK RASHEED ON HIS CSK DEBUT 💛 pic.twitter.com/OUjoQbdhCq
— Johns. (@CricCrazyJohns) April 14, 2025
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లు షేక్ రషీద్‌కు అవకాశం ఇచ్చారు. రవీంద్రకు జోడీగా వచ్చిన అతడు.. ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కొన్నాడు. బౌండరీలతో అలరించిన ఈ చిచ్చరపిడుగు.. అవేశ్ ఖాన్ వేసిన 5వ ఓవర్లో ఔటయ్యాడు. 27 రన్స్‌కే వెనుదిరిగినా.. తన దూకుడైన ఆటతో ఆకట్టుకున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. వస్తూ వస్తూనే జట్టుకు విజయంలో కీలక పాత్ర పోషించిన రషీద్ తదుపరి మ్యాచుల్లో రవీంద్రతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశముంది.