MS Dhoni : ఐపీఎల్ ప్రతి సీజన్లో అభిమానులకు పిచ్చెక్కించే ఎంఎస్ ధోనీ(MS Dhoni) పంతొమ్మిదో సీజన్లో ఇంకా అడుగే పెట్టలేదు. లీగ్ దశ ముగింపు దశకు చేరుకున్నా తాలా ఆటను ఫ్యాన్స్ మిస్సవుతున్నారు. ఆరంభ సీజన్ నుంచి వికెట్ల వెనకాల కుర్రాడిలా కదులుతూ.. ఫినిషర్‌గా సీఎస్కే విజయాల్లో కీలకమైన ధోనీ 19వ ఎడిషన్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇదుగో వస్తుండు.. అదుగో వస్తుండు అనే మాటలు వినిపిస్తున్నా.. ఈ మాజీ కెప్టెన్ ఎంట్రీపై సీఎస్కే యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ పంతొమ్మిదో సీజన్లో ఆడడంపై నెలకొన్ని అనిశ్చితికి తెరపడడం లేదు. మొన్నటికి మొన్న జట్టుతో పాటు హైదరాబాద్ వచ్చినా అతడు ఆడలేదు. రెండు రోజుల క్రితం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో రోహిత్ శర్మను కలిసిన ధోనీ.. తుది జట్టులో ఉంటాడని అందరూ అనుకున్నారు.

కానీ, ఆశ్చర్యంగా.. ఎల్ క్లాసికో మ్యాచ్‌కు ధోనీ, హిట్‌మ్యాన్ వరసగా రెండోసారి దూరమయ్యారు. మే 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ కోసం జట్టంతా ఢిల్లీ వెళ్లగా ధోనీ చెన్నైలోనే ఉండిపోవడం అతడి రాక మరింత ఆలస్యం కానుందనే వార్తలకు బలం చేకూర్చుతోంది.
పంతొమ్మిదో సీజన్ ముందు గాయపడిన ధోనీ.. కాలి పిక్క గాయం నుంచి కోలుకుంటున్నాడు. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతోనే ఐపీఎల్ ఆడడం లేదని సమాచారం. వయసు 44 ఏళ్లు కావడంతో ధోనీ ఫిట్‌గా మారేందుకు మరికొంత సమయం పట్టనుంది. దాంతో.. చెన్నైలోనే తాలా పునరావాస కేంద్రంలో ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో.. ధోనీ ఏదో ఒక దశలో అందుబాటులో ఉంటాడు అని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. పెద్దన్నలాంటి మహీ భాయ్ గైర్హాజరీలో రుతురాజ్ గైక్వాడ్ ఆరంభంలో తడబడినా ఎట్టకేలకు ట్రాక్‌లో పడ్డాడు. ఓపెనర్ శాంసన్.. మిడిలార్డర్లో ఉర్విల్, కార్తిక్ శర్మ.. పేసర్ అన్షుల్ కంబోజ్‌లు రాణిస్తుండగా చెన్నై నాలుగో విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.