మద్యపానం చేసే వాళ్లు విచక్షణా జ్ఞానం పూర్తిగా కోల్పోయి దారుణాలు చేసిన ఘటనలు కోకొల్లలు. తాజాగా హరియాణాలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. బాగా తాగేసి, మద్యం మత్తులో ఉన్న విజయ్ అనే ఒక వ్యక్తి.. తూలుతూ రోడ్డుపై తిరుగుతున్నాడు. అతని శరీరంపై దుస్తులు కూడా సరిగా లేవు.
అలాంటి స్థితిలో ఉన్న అతను.. అక్కడే స్థానికంగా భేల్పూరి అమ్ముకునే రమేష్ రామ్ దగ్గరకు వెళ్లాడు. తనకు ఫ్రీగా భేల్పూరి ఇవ్వాలని అడిగాడు. దానికి రమేష్ నిరాకరించడంతో కోపం తెచ్చుకున్నాడు. అదేరోజు రాత్రి రమేష్ రామ్.. స్థానికంగా ఇంటి పనులు చేస్తుండే భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. సైకిల్‌పై రమేష్ కూర్చొని ఉండగా.. అతని భార్య పక్కనే నడుస్తోంది.
ఈ క్రమంలో దూరం నుంచి పెద్ద రాయితో రమేష్‌పై విజయ్ దాడి చేశాడు. ఆ రాయి వచ్చి రమేష్ తల వెనుక భాగంలో బలంగా తగిలింది. దాంతో అతను నేలపై పడిపోయాడు. విక్రమ్ అక్కడి నుంచి పరారయ్యాడు. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లిన రమేష్ భార్య సుస్మితకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే అతను మరణించాడని వెల్లడించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.