కొలంబో : శ్రీలంక టూర్ ( Srilanka Tour ) లో ఉన్న మరో ఇద్దరు ఇండియన్ క్రికెటర్లకు కోవిడ్ పాజిటివ్(covid positive) వచ్చింది. స్పిన్నర్ యజువేంద్ర చాహెల్ ( Yuzvendra Chahal ) తో పాటు కృష్ణప్ప గౌతమ్ ( Krishnappa Gowtham ) లు కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారత జట్టులో కృణాల్ పాండ్యాకు తొలుత వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ అతనితో కలిశారు. ఈ నేపథ్యంలో చాహల్, గౌతమ్‌లకు కూడా వైరస్ సోకినట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా రెండవ, మూడవ టీ20 మ్యాచ్‌లను ఆడలేదు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను ఇండియా కోల్పోయిన విషయం తెలిసిందే.