హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్..డిప్యూటీ సూపరిండెంట్(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్‌ను కలుసుకుని అధికారికంగా ఉత్తర్వులు అందుకున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణిస్తున్న సిరాజ్ ప్రదర్శనకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం జూబ్లిహిల్స్‌లో 600 గజాల స్థలానికి తోడు గ్రూపు-1 పోస్టింగ్ కింద డీఎస్పీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సిరాజ్.. డీఎస్పీగా అధికారికంగా విధుల్లో చేరాడు. పదునైన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు పరీక్ష పెట్టే ఈ హైదరాబాదీ స్పీడ్‌స్టర్ అనతికాలంలోనే టీమ్ఇండియాలో కీలక బౌలర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.