టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఇవాళ (సోమవారం) 30వ పడిలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా రాహుల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సూర్య.. ‘‘మంచి మనసు ఉన్న నీకు చాలా సంతోషాలు, విజయాలు దక్కాలి. నీతో మరిన్ని భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ఎదురు చూస్తున్నాను బ్రదర్’’ అని ట్వీట్ చేశాడు.
ఇలా సూర్య ఒక్కడే కాదు యువ ఆటగాళ్లు నవదీప్ సైనీ, రాహుల్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ తదితరులంతా రాహుల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
ఈ ఏడాది ఐపీఎల్లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న రాహుల్.. జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇలా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాహుల్.. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాలని మనం కూడా కోరుకుందాం.