డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో యువ క్రికెటర్లను లైంగికంగా వేధించిన(Sexual harrasment) కేసులో కోచ్ నరేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘంలో ఆఫీసు బేరర్‌గా ఉన్న నరేంద్ర తనపై ఆరోపణలు రావడంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అతనికి రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. శుక్రవారం డిస్చార్జ్ అయిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్రికెట్ కోచ్(cricket coach) నరేంద్ర షాకు ప్రైవేటు ట్రైనింగ్ అకాడమీ ఉంది. అయితే ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో అతను విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతనిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టాలను నమోదు చేశారు.
చాన్నాళ్ల నుంచి మహిళలకు అతను క్రికెట్ కోచింగ్ ఇస్తున్నాడు. వేధింపుల్లో ఓ మైనర్ కూడా ఉంది. టీనేజర్లతో అనుచితంగా మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో అతనిపై పోలీసులు నజర్ పెట్టారు.