లాస్ ఏంజిల్స్: 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్(Los Angeles Olympics) క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మెగా ఈవెంట్‌కు చెందిన క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. లాస్ ఏంజిల్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలో పొమినా సిటీలో ఉన్న ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనున్నారు. 2028, జూలై 12వ తేదీన క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. జూలై 20, 29వ తేదీల్లో మెడల్ మ్యాచ్‌లు ఉంటాయని ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. టీ20 ఫార్మాట్లో ఒలింపిక్స్ క్రికెట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
మహిళలు, పురుషుల విభాగాల్లో మొత్తం ఆరు జట్లు క్రికెట్ మెడల్ కోసం పోటీపడనున్నాయి. మొత్తం 180 మంది క్రికెటర్లు గేమ్స్‌కు రానున్నారు. 1900 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో చివరిసారి క్రికెట్‌ను నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించలేదు. జూలై 14, 21 తేదీల్లో క్రికెట్ మ్యాచ్‌లు ఉండవు. 1900లో జరిగిన క్రికెట్ టోర్నీలో కేవలం రెండు జట్లు మాత్రమే పోటీపడ్డాయి. మెడల్ కోసం బ్రిటన్, ఫ్రాన్స్ పోటీపడ్డాయి. లాస్ ఏంజిల్స్‌లో పాల్గొనే 12 జట్లలో.. ఒక్కొక్క జట్టుకు 15 మంది సభ్యులను ఎంపిక చేసే అవకాశం కల్పించారు.