అవినీతి హెచ్సీఏను నిషేధించాలి.. తెలంగాణ క్రికెట్ సంఘం డిమాండ్
తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తూ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని (హెచ్సీఏ) బీసీసీఐ తక్షణమే బ్యాన్ చేయాలని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) డిమాండ్ చేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తూ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని (హెచ్సీఏ) బీసీసీఐ తక్షణమే బ్యాన్ చేయాలని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) డిమాండ్ చేసింది. టీసీఏ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ స్టేక్హోల్డర్స్’ కార్యక్రమంలో క్రికెట్ నిర్వాహకులు, మాజీ క్రీడాకారులు, జిల్లా ప్రతినిధులుపాల్గొని హెచ్సీఏ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
హెచ్సీఏ కేవలం హైదరాబాద్, రంగారెడ్డికే పరిమితమై మిగతా జిల్లాల క్రికెట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బీసీసీఐ అనుమతి, హెచ్సీఏ సర్వసభ్య సమావేశం ఆమోదం లేకుండా ఐదేండ్ల కాలానికి ఫ్రాంచైజీలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికే ‘టీజీ20 లీగ్’ను తెస్తున్నారని టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి ఆరోపించారు. టీసీఏకు గుర్తింపు వచ్చే వరకు సామాజిక, ప్రజాస్వామ్యబద్ధ పోరాటాలను విస్తృతం చేయాలని సమావేశం నిర్ణయించింది. బీసీసీఐ తక్షణమే టీసీఏకు అసోసియేట్ సభ్యత్వ గుర్తింపు ఇవ్వాలని, దీని కోసం తోటి ఎంపీలతో కలిసి కృషి చేస్తానని టీసీఏ ప్యాట్రన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

