NZ vs ZIM : తొలి టెస్టులో ఘోరంగా ఓడిన జింబాబ్వే రెండో టెస్టులోనూ ఓటమిని చవిచూసేలా ఉంది. బ్యాటర్ల వైఫల్యంతో కుప్పకూలిన ఆతిథ్య జట్టుకు షాకిస్తూ న్యూజిలాండ్ (Newzealand) మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. ఓపెనర్ డెవాన్ కాన్వే(153) సూపర్ సెంచరీతో చెలరేగగా.. మిడిలార్డర్ బ్యాటర్లు హెన్రీ నికోలస్(95 నాటౌట్), రచిన్ రవీంద్ర (51 నాటౌట్) అర్ధ శతకాలతో విజృంభించారు. కాన్వే ఒక్కడే ప్రత్యర్ధి స్కోర్ కొట్టగా.. ఈ ఇద్దరి విధ్వంసంతో రెండో రోజు రెండో సెషన్లోనే కివీస్.. మూడొందల ఆధిక్యానికి చేరుకుంది. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 423 రన్స్ కొట్టింది.
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల వరద కొనసాగిస్తున్నారు. జింబాబ్వే బౌలర్లను ఉతికారేస్తూ ఓపెనర్లు డెవాన్ కాన్వే(153 ), విల్ యంగ్(74) భారీ భాగస్వామ్యంతో పెద్ద స్కోర్‌కు బాటలు వేశారు. తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించిన వీళ్లను ఎట్టకేలకు ట్రెవొర్ వాండు విడదీశాడు. యంగ్ బౌల్డయ్యాక వచ్చిన జాకబ్ డఫే(36) త్వరగా ఔటైనా.. కాన్వే తన జోరు చూపాడు. బౌండరీలతో చెలరేగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సెంచరీతో జింబాబ్వే స్కోర్‌ను దాటేసింది కివీస్. కాన్వే వెనుదిరిగే సమయానికి స్కోర్.. 345-3.
Devon Conway outscores Zimbabwe’s first innings score by 28; New Zealand’s lead is already 200-plus 😳
SCORECARD: https://t.co/PwomScGbZg pic.twitter.com/KhQjs98p6F
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2025
ఓపెనర్ దాడి నుంచి బ్రేక్ లభించిందని మురిసిపోయే లోపే హెన్రీ నికోలస్ (95 నాటౌట్), రచిన్ రవీంద్ర(51 నాటౌట్)లు క్రీజులో పాతుకుపోయారు. ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. స్కోర్ బోర్డును వేగంగా నడిపించారిద్దరూ. అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 400 దాటించారు. ఈ ఇద్దరినీ ఔట్ చేయలేక నానా తంటాలు పడగా టీ బ్రేక్ సమయానికి కివీస్ 302 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా 30 రోజుల ఆట మిగిలి ఉండడంతో అలవోకగా సౌథీ బృందం ఐదొందల మార్క్ అందుకోవడం ఖాయం.
Tea on day 2 in Bulawayo: Henry Nicholls 95*, Rachin Ravindra 51*. New Zealand is already 302 ahead with no signs of slowing ⚡
SCORECARD: https://t.co/PwomScGbZg pic.twitter.com/evgBNCdXWv
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2025