హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ): సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీ నియమించిన క్రికెట్ ఆటగాళ్ల సెలెక్షన్ కమిటీలను,లీగ్ మ్యాచ్‌ల పర్యవేక్షణకు హైకోర్టు నియమించిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు సారథ్యంలోని సూపర్ వైజరీ కమిటీని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెసీఏ)కు ఆదేశాలు జారీ చేసింది.
హెచ్‌సీఏ తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే వరకు తాము జారీ చేస్తున్న ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. హెచ్‌సీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) ఇప్పటి వరకు నిర్వహించలేదని, ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే వరకు సదరు కమిటీలను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ అంబర్‌పేట్‌కు చెందిన జై హనుమాన్ క్లబ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె శరత్ గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు.