హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఆసియా పసిఫిక్ ప్రపంచ క్రీడా పోటీల్లో వనపర్తికి చెందిన కానిస్టేబుల్ గోపాల్ నాయక్ డబుల్ ధమాకా మోగించాడు. దక్షిణ కొరియా వేదికగా జరిగిన ఈ క్రీడల్లో గోపాల్.. డిస్కస్‌త్రోలో పసిడి, షాట్‌పుట్‌లో రజత పతకాలు కైవసం చేసుకున్నాడు.
వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న గోపాల్ ఈ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 79 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో 2 పతకాలు సాధించిన గోపాల్‌కు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.