Shashi Tharoor : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు (Oval Test)లో భారత జట్టు చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. నాలుగో రోజు బౌలర్ల వైఫల్యంతో సిరీస్‌పై ఆశలు సన్నగిల్లినా.. ఐదో రోజు సిరాజ్ సూపర్ స్పెల్‌తో అనూహ్యంగా విజేతగా నిలిచింది టీమిండియా. సమిష్టిగా పోరాడి చిరస్మరణీయ విక్టరీతో సిరీస్ పంచుకున్న గిల్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ ఆటగాళ్ల నుంచి రాజకీయ వేత్తల వరకూ ‘సాహో టీమిండియా’ అంటున్నారు. అయితే.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) మాత్రం భారత క్రికెటర్లకు క్షమాపణలు చెప్పారు.
ఓవల్‌లో చరిత్రనిలిచిపోయే గెలుపుతో కితాబులందుకుంటున్న వేళ.. బౌలర్లు తేలిపోయారంటూ తాను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటునట్టు థరూర్ పేర్కొన్నారు. ‘నాకు మాటలు రావడం లేదు. ఎంత గొప్ప విజయమిది. సిరీస్ సమం చేసిన ఈ విక్టరీ భారత జట్టుకు ఎంతో అపురూపం. ఆటగాళ్లు అచంచల పట్టుదల, అంకితభావం.. సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ టీమ్ చాలా ప్రత్యేకం’ అని కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేశారు.
ఐదు వికెట్లతో భారత్‌ను గెలిపించిన సిరాజ్
అంతేకాదు.. ఆదివారం ఇంగ్లండ్ పుంజుకునే అవకాశం ఇచ్చినందుకు బౌలర్లను, గొప్పగా ఆడనందుకు ఆటగాళ్లను నిందించినందుకు తనను క్షమించాలని థరూర్ అన్నారు. ‘నాలుగో రోజు ఆట చూశాక భారత జట్టు విజయంపై అనుమానాలు వ్యక్తం చేశాను. కానీ, సిరాజ్ మాత్రం తన శక్తిపై నమ్మకంతో జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు. ఓవల్‌లో చిరస్మరణీయ విజయంలో భాగమైన భారత ఆటగాళ్లకు అభినందనలు’ అని థరూర్ మరొక ట్వీట్లో వెల్లడించారు.
Words fail me….WHAT A WIN! 🇮🇳🏏 Absolutely exhilarated & ecstatic for #TeamIndia on their series-clinching victory against England! The grit, determination, and passion on display were simply incredible. This team is special.
I am sorry that I expressed a spasm of doubt about…— Shashi Tharoor (@ShashiTharoor) August 4, 2025
‘అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో కొన్నిసార్లు నేను విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నట్టు అనిపించింది. కానీ, ఈమ్యాచ్‌లో విరాట్ ఉండే బాగుండు అని అనుకున్నా. మైదానంలో అతడు ఉంటే సహచరుల్లో స్ఫూర్తి నింపేవాడు. అతడు తన బ్యాటింగ్ నైపుణ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేవాడు. అతడిని రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని అడగాలనుకున్నా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. విరాట్.. దేశం నిన్ను కోరుకుంటోంది’ అని నాలుగో రోజు అసహాయ స్థితిలో నిలిచిన భారత జట్టును ఉద్దేశించి థరూర్ ట్వీట్ చేశారు.
I’ve been missing @imVkohli a few times during this series, but never as much as in this Test match. His grit and intensity, his inspirational presence in the field, not to mention his abundant batting skills, might have led to a different outcome. Is it too late to call him out…
— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2025