న్యూఢిల్లీ: బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan)ను బీసీసీఐ పక్కనపెట్టేసింది. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగే ఇండియా ఏ జట్టును ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ బృందంలో సర్ఫరాజ్ ఖాన్ లేకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. భారతీయ జట్టు ఎంపిక ప్రక్రియలో మతపరమైన పరిణామాలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత షమా మొహమ్మద్ ఆరోపించారు. ఆ ఇంటి పేరు ఉన్నందుకే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదా అని ఆమె అడిగారు. ఇలాంటి అంశాల్లో చీఫ్ కోచ్ గౌతం గంభీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తమకు తెలుసు అని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. క్రికెట్ జట్టును మతం ఆధారంగా విభజించాలని చూస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది.
వాస్తవానికి సర్ఫరాజ్ ఖాన్ చివరిసారి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడాడు. ఇక గాయం వల్ల ఇటీవల ఆస్ట్రేలియా ఏతో జరిగిన సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం భారత కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. రిషబ్ మళ్లీ జట్టులోకి రావడం వల్ల సర్ఫరాజ్‌ను పక్కనపెట్టేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై రాజకీయ వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి షమా మొహమ్మద్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Is Sarfaraz Khan not selected because of his surname ! #justasking . We know where Gautam Gambhir stands on that matter
— Dr. Shama Mohamed (@drshamamohd) October 22, 2025