లండన్: 2026లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గో ఆతిథ్యమివ్వనున్నట్టు సమాచారం. వాస్తవానికి వచ్చే ఎడిషన్ గేమ్స్‌కు విక్టోరియా(ఆస్ట్రేలియా) ఆతిథ్యమివ్వాల్సి ఉండగా వ్యయభారం కారణంగా ఆ నగరం తాము రేసు నుంచి వైదొలుగుతున్నామని గతేడాదే ప్రకటించింది. గ్లాస్గో ఇదివరకే 2014 లో ఈ క్రీడలను నిర్వహించింది.