న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగే భారత అథ్లెట్లు డోపింగ్‌లో విఫలం కావడం అంతకంతకూ పెరుగుతున్నది. ఇప్పటికే ధనలక్ష్మి, ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షలో ఫెయిల్ కారణంగా జట్టు నుంచి ఉద్వాసన ఎదుర్కొగా, తాజాగా మరొకరు ఈ జాబితాలో చేరారు.
మహిళల 4x 100మీటర్ల రిలే టీమ్‌లో సభ్యురాలైన అథ్లెట్ డోపింగ్‌లో దొరికిపోవడంతో జట్టు నుంచి తప్పించారు. అయితే ఫెయిల్ అయిన సదరు అథ్లెట్ పేరును వెల్లడించేందుకు అధికారులు నిరాకరించినట్లు తెలిసింది. డోపింగ్‌లో సదరు అథ్లెట్ విఫలం కావడంతో 4x 100మీటర్ల విభాగంలో నలుగురు మాత్రమే మిగిలారు. ఎవరైనా గాయపడితే పతక ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిస్తుంది.