హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రామీణ క్రీడా రంగాన్ని పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కప్ టోర్నీకి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి గ్రామ స్థాయి పోటీలతో సీఎం కప్ పోటీలకు తెరలేవనుంది. మొత్తంగా 36 క్రీడాంశాలతో నాలుగు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తారు.
రెండు రోజుల్లో దాదాపు 12వేల గ్రామాల్లో అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, యోగాతో పాటు స్థానిక ఆటకు ప్రాధాన్యమివ్వనున్నారు. సీఎం కప్లో పోటీపడేందుకు శుక్రవారం సాయంత్రం వరకు లక్ష మంది ప్లేయర్లు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని సాట్స్ తెలిపింది.