కొలంబో: పై ఫొటోలో ఉన్న ప్లేయర్‌ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆదివారం ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడీ ప్లేయర్. ఇతన్ని సడెన్‌గా చూస్తే.. విరాట్ కోహ్లి ఏంటి ఇక్కడ ఉన్నాడు అనిపించక మానదు. కొందరైతే ఇతడు క్లీన్ షేవ్ చేసుకున్న విరాట్ కోహ్లి అంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటోను వైరల్ చేశారు. ఇంతకీ ఈ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా? ఇతని పేరు ఇషాన్ కిషన్. ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ శ్రీలంకతోనే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అంతేకాదు తనదైన స్టైల్లో కేవలం 42 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఆదివారం అతని బర్త్‌డే కూడా. ఈ 23 ఏళ్ల ప్లేయర్ అచ్చూ కోహ్లిని తలపిస్తున్నాడంటూ ట్విటర్లో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఇతడు హెల్మెట్ పెట్టుకుంటే సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్లా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డారు.
NOT ONLY LOOKING LIKE VIRAT KOHLI HE IS ONE DOWN BATTING LIKE VK AND HITS SIX ON HIS FIRST BALL OF CAREER ✌🏻✌🏻✌🏻😎😎😎
— Anand Rathod (@ar_writes_3482) July 18, 2021