Chris Woakes : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన పదిహేనేళ్ల సుదర్ఘీ కెరీర్‌కు సోమవారం అల్విదా చెప్పేశాడీ పేస్‌గన్. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందే గాయం నుంచి కోలుకున్న వోక్స్ … మరోసారి గాయపడడంతో కెరీర్ ప్రమాదంలో పడింది. చివరిదైన ఓవల్ టెస్టులో ఎడమ భుజం పక్కకు జరగడంతో యాషెస్ సిరీస్‌లో ఆడాలనుకున్న అతడి కల చెదిరింది. దాంతో.. గాయాలతో వేగలేకనే తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నాడీ స్పీడ్‌స్టర్.
‘క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసింది. అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నా. ఇంగ్లండ్ తరఫున ఆడాలనేది నా చిన్నప్పటి కల. నా డ్రీమ్‌ను నిజం చేసుకున్నందుకు చాలా అదృష్టవంతుడిని. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించడం, మూడు సింహాలు ముద్రించి ఉన్న జెర్సీని ధరించడం.. గత పదిహేనేళ్లుగా మైదానంలో సహచరులతో గడపడం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి. టీమ్‌మేట్స్‌లో చాలామంది నాకు జీవితకాల మిత్రులుగా మారిపోయారు. ఇన్నేళ్ల నా కెరీర్‌ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అని వోక్స్ తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు. అంతేకాదు తన ఈ ప్రయాణంలో ఎంతగానో సహకరించిన అభిమానులు, కుటుంబం, భార్య అమీ, కూతుళ్లు లైలా, ఎవీలకు కృతజ్ఞతలు తెలపాడు వోక్స్.
Pleasure has been all mine. No regrets 🏴 pic.twitter.com/kzUKsnNehy
— Chris Woakes (@chriswoakes) September 29, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు(Oval Test)లో ఫీల్డింగ్ చూస్తూ గాయపడ్డాడు వోక్స్. ఎడమ భుజం స్థానభ్రంశం చెందడంతో నొప్పితో మైదానం వీడిన అతడు ఐదో రోజు జట్టు కోసం క్రీజులోకి వచ్చాడు. చేతికి పట్టీతో వచ్చిన అతడు అట్కిన్సన్‌తో కలిసి పోరాడాడు. కానీ, సిరాజ్ సంచలన స్పెల్‌తో సూపర్ విక్టరీ కొట్టిన టీమిండియా సిరీస్ సమం చేసింది. ప్రస్తుతం కోలుకుంటున్న అతడిని యాషెస్ సిరీస్ (Ashes Series)కు పక్కనపెట్టేశారు సెలెక్టర్లు. ఇక గాయాలతో వేగించి చాలు.. జట్టుకు తన సర్వీస్ కూడా చాలు అనుకున్నాడు కాబోలు.. రిటైర్మెంట్ వార్తతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చాడు వోక్స్.
After 14 years, Chris Woakes has announced his international retirement pic.twitter.com/XlpM7EimoI
— ESPNcricinfo (@ESPNcricinfo) September 29, 2025
ఆస్ట్రేలియాపై 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పీడ్‌స్టర్ 62 మ్యాచుల్లో 192 వికెట్లు తీశాడు. విదేశాల్లో కంటే స్వదేశంలోనే ప్రమాదకరమైన బౌలర్‌గా ముద్ర పడిన వోక్స్ ఇంగ్లండ్ గడ్డపైనే 23.47 సగటుతో 148 వికెట్లు పడగొట్టాడు.ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, సెంచరీతో ‘లార్డ్స్ హానర్స్ బోర్డు’లోకి ఎక్కాడీ లెజెండరీ బౌలర్. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో వోక్స్ సభ్యుడు. జోస్ బట్లర్ నేతృత్వంలో పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలిచాడీ పేసర్.