ఓవల్: ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్ వోక్స్(Chris Woakes).. భారత్‌తో ఓవల్‌లో జరుగుతున్న అయిదో టెస్టు నుంచి ఔటయ్యాడు. తొలి రోజు గురువారం అతను గాయపడ్డ విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపబోయి కిందపడ్డాడు. దీంతో అతనికి భుజానికి గాయమైంది. భుజం ఎముకలు డిస్లొకేట్ అయినట్లు ఎక్స్‌రేలో తేలింది. దీంతో ఓవల్ టెస్టుకు సంబంధించిన మిగితా నాలుగు రోజుల ఆటకు అతను దూరం అయ్యాడు. నిన్న సాయంత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి చికిత్స చేశారు.
ఇవాళ ఉదయం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. ఓవల్ టెస్టులో కనీసం అతను బ్యాటింగ్ కూడా చేయలేడని పేర్కొన్నది. తొలి రోజు వోక్స్ 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దాంట్లో 46 రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఒక పేస్ బౌలర్ లేకుండానే ఇంగ్లండ్ ఆటను కొనసాగించనున్నది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో అతను 52.18 సగటుతో 181 ఓవర్లలో 11 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ జట్టులో అనుభవం ఉన్న సీనియర్ బౌలర్ వోక్స్ కావడం వల్ల ఆ జట్టుకు పెద్ద దెబ్బ పడనున్నది. అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టాంగ్ బౌలర్లు కొన్ని టెస్టులే ఆడారు.
A further assessment will take place at the end of the series 🙏 pic.twitter.com/9mzGbV5WSL
— England Cricket (@englandcricket) August 1, 2025