అబుదాబి: టీ20ల్లో క్రిస్ గేల్ తన చివరి ఇన్నింగ్స్‌ను ఆడేశాడా ? ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఔటైన తర్వాత క్రిస్ గేల్ మైదానం నుంచి వెళ్తూ తన బ్యాట్‌ను స్టేడియంలోని ప్రేక్షకుల వైపు ఎత్తి చూపాడు. దీంతో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికినట్లు స్పష్టమవుతోంది. హెల్మెట్ తీసేసిన గేల్.. తన చేతిలో ఉన్న బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు చూపిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్ దిశగా వెల్లాడు. ఫీల్డ్ నుంచి వెళ్లిన గేల్‌కు తన జట్టు సభ్యులు గ్రీట్ చేశారు. చాలా సైలెంట్‌గా తనదైన స్టయిల్లో పవర్ ప్లేయర్ క్రిస్ గేల్ .. వెస్టిండీస్‌కు తన చివరి మ్యాచ్ ఆడేసినట్లు సంకేతం ఇచ్చాడు. నిజానికి ఇవాళ్టి మ్యాచ్‌లో గేల్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. సన్‌గ్లాస్‌లు పెట్టుకుని గ్రౌండ్లోకి దిగిన గేల్.. రెండు భారీ సిక్సర్లతో ఆశలు రేపాడు. ఇక విండీస్‌కు భారీ స్కోర్‌ను అందిస్తాడనుకున్న సమయంలో గేల్ 15 రన్స్ చేసి బౌల్డయ్యాడు.
Six & Out. Ahhh @henrygayle couldn’t have finished his West Indies white-ball career in more apt fashion #T20WorldCup #AusvWI pic.twitter.com/MUYr0g9LOg
— Bharat Sundaresan (@beastieboy07) November 6, 2021
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు క్రిస్ గేల్ 19,593 రన్స్ చేశాడు. వాటిల్లో 553 సిక్సర్లు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా క్రిస్ గేల్ నిలిచాడు. వెస్టిండీస్ తరపున గేల్ 75 ఇన్నింగ్స్‌లు ఆడాడు. దాంట్లో 1899 రన్స్ చేశాడు. 14 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో 123 సిక్సులు, 158 ఫోర్లు ఉన్నాయి. ఇవాళ మైదానం నుంచి గేల్ బయటకు వెళ్లిన తీరు.. అతను విండీస్‌కు చివరి మ్యాచ్ ఆడేశాడా లేదా అన్న క్లారిటీని ఇవ్వలేకపోయింది.
Thank you for each and every memory @henrygayle. A legend on and off the field. 22 years of unforgettable memory, the dominator of T20 cricket. None looked as good as him at peak in the shortest format.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2021
Thanks for making my childhood memorable one with those unbelievable knocks. pic.twitter.com/ozcHR2bog2
A photo that gives you the feels 💕#T20WorldCup | #AUSvWI
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2021
Does that acknowledgement from @henrygayle suggest something? What a batter! For me, the best in the T20 format. Take a bow, my friend. #legend #universeboss
— VVS Laxman (@VVSLaxman281) November 6, 2021