అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న
ప్రభు సిమ్రాన్(7) ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్‌గేల్ బౌండరీల వర్షం కురిపించాడు. జేమీసన్ వేసిన ఆరో ఓవర్లో 5 ఫోర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లే ఆఖరికి పంజాబ్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లలోనూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. రాహుల్(35), గేల్(39) క్రీజులో ఉన్నారు.
5⃣0⃣-run stand! 👏👏
— IndianPremierLeague (@IPL) April 30, 2021
A quickfire half-century partnership between @klrahul11 and @henrygayle as @PunjabKingsIPL move to 70/1 after 8 overs. 👌👌 #VIVOIPL #PBKSvRCB
Follow the match 👉 https://t.co/GezBF86RCb pic.twitter.com/uO1sFvxD52