Tragedies in Indian Sports : భారత క్రీడా చరిత్రలో ఆర్సీబీ విక్టరీ పరేడ్ చీకటి రోజుగా మారిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మనదేశంలోని క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన రెండో సంఘటన ఇది. అంతకుముందు అంటే.. 1980లో కోల్‌కతాలో రెండు ఫుట్‌బాల్ క్లబ్స్ ఫ్యాన్స్ మధ్య చెలరేగిన గొడవలకు 16 మంది బలయ్యారు.
ఫుట్‌బాల్‌లో చిరకాల ప్రత్యర్థులు మోహున్ బగన్ (Mohun Bagan), ఈస్ట్ బెంగాల్ (East Bengal) మధ్య ఆగస్టు 16న జరిగిన మ్యాచ్‌ను ఇప్పటికీ మర్చిపోలేరు అభిమానులు. ఆ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు 70 వేల మంది వచ్చారు. అయితే.. మోహన్ బగన్ ఫుట్‌బాలర్ బిదేశ్ బసును ఈస్ట్ బెంగాల్ ఆటగాడు దిలీప్ పలిత్ తోసేశాడు. అంతే.. ఇరుజట్ల ఫ్యాన్స్ గొడవకు దిగి రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు స్పందించే లోపే పరిస్థితి చేయి దాటగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన సంఘటన జరిగి 45 ఏళ్లు కావొస్తోంది.
City of Sorrow to Garden of Death.#Stampede #RCB
When August 16, 1980 in Kolkata returnedhttps://t.co/oEs0IFuyCp— Kushan Sarkar (@kushansarkar) June 4, 2025
జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవ యాత్ర కూడా విషాదాంతమైంది. చిన్నస్వామికి పోటెత్తిన వాళ్లలో 11 మంది అసువులు బాశారు. వీళ్లలో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. అసలేం జరిగిందంటే.. తొలిసారి ఐపీఎల్ విజేతగా అవతరించిన బెంగళూరు జట్టుకు చిన్నస్వామి స్టేడియంలో సన్మాన సభ ఏర్పాటు చేసింది కర్నాటక ప్రభుత్వం. అనంతరం భారీ ర్యాలీని ప్లాన్ చేశారు. అయితే.. అభిమానులు మైదానానికి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోయారు.
Bengaluru, Karnataka: CM Siddaramaiah on stampede near Bengaluru’s Chinnaswamy Stadium says, “It is an unexpected tragedy. No one anticipated this. We didn’t know the crowd would be around 3 to 4 lakh people, while the stadium’s capacity was only 35,000”
(Video Source: CMO) pic.twitter.com/DldcctxUk7
— IANS (@ians_india) June 4, 2025
స్టేడియం సామర్ధ్యం 35 వేలుకాగా .. దాదాపు 3 లక్షల మంది రావడంతో స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా మైదానం గేట్లు తెరవడంతో అభిమానులు భారీ కేడ్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ చార్జీ చేసినా లాభం లేకోయింది. అందరూ ఒకేసారి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు సొమ్మసిల్లి కింద పడిపోయారు. వాళ్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సీపీఆర్ చేసినా కొందరు ప్రాణాలు నిలవలేదు. ఈ సంఘటనలో 11 మంది మరణించారని, 33 మంది తీవ్రంగా గాయపడ్డారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తెలిపారు.
ఈ దురదృష్టకర ఘటనకు బాధ్యత తమదేనంటూ చెప్పిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవాళ్లకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తామని ప్రధాని తెలిపారు.