Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య చైనా(China) చరిత్ర సృష్టించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పాకిస్థాన్(Pakistan)ను చైనా చిత్తుగా ఓడించింది. ఆట ఆరంభం నుంచి పాక్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన చైనా ఆటగాళ్లు 1-1తో స్కోర్ సమం చేశారు. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్లోనూ చైనా ఆటగాళ్లు అద్భుతం చేశారు. 2-0తో ఆధిపత్యం కనబరిచి పాక్‌ను సాగనంపారు.
లీగ్ దశలో భారత జట్టు చేతిలో ఓడిన చైనా ఆ తర్వాత పుంజుకుంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్లో 2-0తో జపాన్‌పై విజయం సాధించింది. దాంతో, పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. అయితే.. పాకిస్థాన్‌ను దాటి ఫైనల్ వెళ్లడం ఆతిథ్య జట్టుకు కష్టమే అనుకున్నారంతా. కానీ, ఆ జట్టు ఆటగాళ్లు తమ దేశం చిరకాల కలను నిజం చేయాలనే ఉద్దేశంతో కసితో ఆడారు.
Hero of the Match, Takumi Kitagawa of Japan said, “We are happy to end our campaign on a winning note. We never gave up till the end and wanted to win this game, giving it our all.” pic.twitter.com/Vp517h6wMR
— Asian Hockey Federation (@asia_hockey) September 16, 2024
నిర్ణీత సమయంలో 1-1తో స్కోర్ సమం చేసి మ్యాచ్‌ను పెనాల్టీ షూటౌట్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా చైనా గోల్‌కీపర్ పాక్ ఆటగాళ్ల ఎత్తులను చిత్తు చేయడంతో చైనా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. ఫైనల్లో చైనాతో తలపడేది ఎవరో మరికాసేపట్లో తేలనుంది. రెండో సెమీ ఫైనల్లో ఆడుతున్న భారత్, కొరియాలలో ఒకరిని టైటిల్ పోరులో చైనా ఢీకొట్టనుంది. చైనా చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన జపాన్ ఐదో స్థానం కోసం మలేషియాతో తలపడనుంది.