Tarisai Masakanda : జింబాబ్వే మాజీ క్రికెటర్ తరిసాయ్ మసకంద (Tarisai Masakanda) అరెస్ట్ అయ్యాడు. భార్యను చంపేందుకు ప్రయత్నించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడి భార్యను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మసకందపై హత్యాయత్నం కేసు(Attempted Murder) నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే..?
మసకంద భార్య టినోడివనషె మకునికె(Tindowanashe Makunike) ఈమధ్యే ఓ దుకాణం ఏర్పాటు చేసేందుకు ఇద్దరు మనుషులను నియమించుకుంది. ఈ ఇద్దరు డబ్బుల కోసం మసకంద ఇంటికి వచ్చారు. అక్కడ వాళ్లు మసకందతో గొడవ పడ్డారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన అతడు ‘ఇదంతా నీవల్లనే’ అంటూ భార్యపై ఊగిపోయాడు. అందుకు ఆమె కూడా మసకందను తిట్టి పోసింది. అంతే.. ‘నీ అంతు చూస్తా’ అంటూ అతడు కిచెన్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి మకునికెపై దాడి చేశాడు.
Can’t wait 😉 https://t.co/7EFxbNxFzh
— Tary Musakanda (@tary_t31) November 21, 2018
‘మసకంద నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మకునికె రెండు చేతులు, వీపు భాగంలో తీవ్ర గాయాలు అయ్యియి. కాపాడండి కాపాడండి అని అరవడం విన్న ఇరుగుపొరుగు పరుగున వెళ్లి మసకందను అడ్డుకొని ఆమె ప్రాణాలు కాపాడారు. దాంతో, అతడిపై హత్యాయత్నం కేసు పెట్టాం’ అని పోలీసులు తెలిపారు.
Watch @Tary_t31 speak about his form, his side’s progress and getting back to cricket https://t.co/VnSUicKAVd #3mob
— larry kwirirayi ✍📔 (@kwirirayi) October 12, 2020
మసకంద అరెస్ట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతడు పోలీసుల చేతికి చిక్కాడు. 2022లో కారుప్రమాదంలో ఒకరిని పొట్టనబెట్టుకున్నాడు. అయితే.. ఆ విషయం పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ, ఆ ప్రమాదంపై విచారణ అనంతరం పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆదినుంచి మసకంద ప్రవర్తన వివాదాస్పంగా ఉండేది. అందుకనే 2020లో న్యూ సిటీ క్రికెట్ క్లబ్ అతడిపై వేటు వేసింది. జింబాబ్వే తరఫున ఐదు టెస్టులు, 16 వన్డేలు, 12 టీ20లు ఆడాడు.