ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న గోల్ఫ్ కోర్సులో.. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. గోల్ఫ్ కోర్సులో ఉన్న పొదల నుంచి ఓ వ్యక్తిని ట్రంప్ షూట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ర్యాన్ వెస్టే రౌత్(Ryan Routh) అనే 58 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతను డోనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. స్వంతంగా పబ్లిష్ చేసుకున్న బుక్‌లో.. ట్రంప్‌ను అతను తిట్టిపోశాడు. ట్రంప్ ఓ ఈడియట్, బఫూన్, ఫూల్ అంటూ పేర్కొన్నారు. నిందితుడు ర్యాన్ వెస్లీ.. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాడు.
2018లో ఇరాన్‌తో జరిగిన అణు ఒప్పందం నుంచి విత్‌డ్రా చేసుకోవడం ట్రంప్ చేసిన పెద్ద నేరమని రౌత్ తన బుక్‌లో ఆరోపించారు. దీని వల్లే రష్యాకు టెహ్రాన్ దగ్గరైనట్లు తేల్చారు. డ్రోన్ల సరఫరాతో ఉక్రెయిన్ చాలా నష్టపోయినట్లు ర్యాన్ పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్‌లో ఉన్న రాజకీయ పరిస్థితిపై కూడా రౌత్ ఓపీనియన్ ఇచ్చారు. ఆఫ్ఘన్ రెఫ్యూజీలు.. ఉక్రెయిన్ ఓసం ఫైట్ చేయాలన్నారు. తైవాన్, నార్త్ కొరియా, వెనిజులా గురించి కూడా పుస్తకంలో రాశారు.
అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో నియంతృత్వ పాలన, జనవరి ఆరో తేదీన యూఎస్ క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి ఒక్కటే అన్నట్లు నిందితుడు ర్యాన్ తన బుక్‌లో పేర్కొన్నారు. గోల్ప్ కోర్సులో ట్రంప్‌కు 500 గజాల దూరంలో ఉన్న ర్యాన్ నుంచి ఏకే-47 లాంటి రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి హవాయిలో చిన్నవ్యాపారం ఉన్నది.