ముంబై : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కవితారెడ్డి ముంబై హాఫ్ మారథాన్‌లో మహిళల టైటిల్ చేజిక్కించుకున్నది. ఏకపక్షంగా సాగిన పోరులో కవితారెడ్డి 1గం.37.03 నిమిషాలలో గమ్యం చేరి విజేతగా నిలిచింది. సమీప ప్రత్యర్థికంటే ఆమె దాదాపు మూడు నిమిషాలు ముందుగా లక్ష్యాన్ని చేరుకుంది. తన్మయకర్మాకర్ 1గం.40.18ని.లలో రెండో స్థానంలో, కేతకి సాథె 1గం.44.55ని.లలో మూడో స్థానంలో నిలిచారు.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పోటీలను ప్రారంభించి, అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశాడు.