Cheteshwar Pujara | వేటు పడ్డాక ఆట మెరుగైంది… దులీప్ ట్రోఫీలో శతక్కొట్టిన పుజారా
Cheteshwar Pujara | ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా దేశవాళీల్లో దుమ్మురేపుతున్నాడు. సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన సమయంలో తనకు అలవాటైన శైలిలో పుజారా క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టాడు.
Cheteshwar Pujara | ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా దేశవాళీల్లో దుమ్మురేపుతున్నాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన పుజారా (278 బంతుల్లో 133; 14 ఫోర్లు, ఒక సిక్సర్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన సమయంలో తనకు అలవాటైన శైలిలో పుజారా క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టాడు.
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్ స్కోరు 149/3తో మూడో రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్.. ఆట ముగిసే సమయానికి 292/9తో నిలిచింది. చివరి బంతిని పుజారా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీ అనంతరం వెనుదిరగగా.. సర్ఫరాజ్ ఖాన్ (6) విఫలమయ్యాడు. ఈ క్రమంలో కింది వరుస బ్యాటర్లతో కలిసి పుజారా జట్టుకు విలువైన పరుగులు అందించాడు.
పుజారా అసమాన పోరాటంతో వెస్ట్ జోన్ 384 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేయగా.. సెంట్రల్ జోన్ 128 రన్స్‌కే ఆలౌటైంది. WTC ఫైనల్ ప్రదర్శనతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం పుజారాను జట్టు నుంచి తప్పించిన సెలెక్టర్లు.. అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 12 నుంచి భారత జట్టు వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుండగా.. దశాబ్ద కాలంగా పుజారా బరిలోకిదిగిన వన్‌డౌన్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

