ఐసీసీ ర్యాంకింగ్స్: పుజారా ఆరు..రహానె ఎనిమిది

దుబాయ్: ఐసీసీ తాజాగా ప్రకటించిన ప్లేయర్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఛతేశ్వర్ పుజారా ఆరోస్థానానికి దూసుకెళ్లాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకుకు పడిపోయాడు. భారత్ టెస్టు జట్టు వైస్‌కెప్టెన్ రహానె ఒక స్థానం మెరుగుపరచుకొని ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పుజారా, రహానె గొప్పగా రాణించిన విషయం తెలిసిందే.
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా మూడు, అశ్విన్ ఆరో ర్యాంకులో కొనసాగుతున్నారు.
తాజావార్తలు
- ఏపీలో కొనసాగుతున్న బంద్..
- బుమ్రా పెళ్ళి చేసుకోబోయే హీరోయిన్ ఈవిడేనా..!
- న్యూజిలాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- ఇలవైకుంఠపురిలో..
- తెలంగాణలో మండుతున్న ఎండలు
- మోసపోయి.. మోసం చేసి
- 05-03-2021 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
- రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా
- పీడీయాక్టు పెట్టినా మారలేదు..
- అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..