Cheteshwar Pujara | భారత జట్టు సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు ఆదివారం వీడ్కోలు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడడం, ప్రతిసారీ మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం తనకు ఎంత ప్రత్యేకమైనదో మాటల్లో చెప్పలేనని.. కానీ ప్రతిదానికి ముగింపు ఉంటుందని.. భారత క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో పుజారా కామెంటేటర్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఇక పుజారా చివరిసారిగా జూన్ 2023లో ఇంగ్లండ్‌లోనే చివరి టెస్ట్ ఆడాడు.
He stood tall when the storm raged, he fought when hope was fading. Congratulations Pujji 🇮🇳@cheteshwar1 pic.twitter.com/0Tj836uoO9
— Gautam Gambhir (@GautamGambhir) August 24, 2025
ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆఖరిది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత జట్టును ఓడించింది. పుజారా తన అంతర్జాతీయ కెరీర్లో 103 టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 176 ఇన్నింగ్స్‌లలో 43.61 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 206 పరుగులు కాగా.. వన్డేల్లో అతను 39.24 సగటుతో 51 పరుగులు చేశాడు. పుజారా ఐపీఎల్లో 30 మ్యాచ్‌లు ఆడాడు. 22 ఇన్నింగ్స్‌లలో అతను 99.75 స్ట్రయిక్ రేట్‌తో 390 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పుజారాకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
You have been a symbol of everything Indian cricket stands for @cheteshwar1. You were tough, an absolute fighter, you played with class and dignity and everytime you were on the field, you did your best for India. As followers, we could not have asked for more. Indian fans will…
— Harsha Bhogle (@bhogleharsha) August 24, 2025
టీమ్ ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ తుఫాను వచ్చినప్పుడు అండగా నిలిచాడని.. ఆశలు సన్నగిన్నలుతున్నప్పుడు పోరాడాడని గంభీర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బొగ్లే స్పందిస్తూ.. భారత క్రికెట్‌కు పుజారా చిహ్నంగా నిలుస్తాడని పేర్కొన్నారు. అతనో పోరాట యోధుడని.. గౌరవప్రదమైన క్రికెట్ ఆడాడని పేర్కొన్నారు. మైదానంలో ప్రతిసారీ భారత్ కోసం తనవంతు కషి చేశాడని.. భారత అభిమానులు ఈ రోజు ఎక్కడ ఉన్న లేచి నిలబడి చప్పట్లు కొడుతారని పేర్కొన్నారు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాట్లాడుతూ భారత క్యాప్ ధరించి సాధించిన దానికి చాలా గర్వపడాలని.. భవిష్యత్ బాగుండాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. పుజారా రిటైర్మెంట్పై బీసీసీఐ సైతం స్పందించింది. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని పేర్కొంది.
First of his name, last of his kind. Take a bow on a stellar career @cheteshwar1 🙌🏻 You should be mighty proud of what you achieved donning the India cap. Congratulations and all the best for what’s to come 🤗 pic.twitter.com/JURHSo3QIG
— Wasim Jaffer (@WasimJaffer14) August 24, 2025
1️⃣0️⃣3️⃣ Tests
7️⃣1️⃣9️⃣5️⃣ Runs
1️⃣6️⃣2️⃣1️⃣7️⃣ Balls Faced
1️⃣9️⃣ Hundreds
3️⃣5️⃣ Half-centuriesOne of the grittiest and finest to have ever represented #TeamIndia in Test cricket! 🙌 🙌
Chesteshwar Pujara – Congratulations on a wonderful Test career & best wishes for the road ahead! 👍 👍… pic.twitter.com/pYurWTNYWL
— BCCI (@BCCI) August 24, 2025