న్యూఢిల్లీ: భారత్ నుంచి మరో యువ చెస్ ప్లేయర్ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఫ్రాన్స్‌లో జరిగిన లా ప్లాగ్నె ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివెల్లో మూడో జీఎం నార్మ్ ద్వారా హరికృష్ణన్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు.
తద్వారా భారత్ నుంచి జీఎం హోదా పొందిన 87వ ప్లేయర్‌గా నిలిచాడు. గత కొన్నేండ్ల కింద తొలి జీఎం పొందిన..స్పెయిన్‌లో రెండోది దక్కించుకున్న హరికృష్ణన్ తాజాగా మూడో నార్మ్‌తో జీఎం జాబితాలో చేరినట్లు అతని కోచ్ మోహన్‌రాజ్ పేర్కొన్నాడు.