Chennai Super Kings : అఫ్గనిస్థాన్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. వందలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రకృతి విలయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీ విచారం వ్యక్తం చేసింది. విపత్తు వేళ కుటుంబ సభ్యులను, ఆత్మీయులను కోల్పోయిన వాళ్లకు సానుభూతి తెలియజేసింది. ఈ భూకంపం వార్త విని తమ హృదయం ముక్కలైందని.. ఈ కష్ట సమయంలో తామ అఫ్గనిస్థాన్ ప్రజల గురించి ప్రార్ధిస్తామని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
అఫ్గనిస్థాన్‌లోని నంగర్హర్, కునార్ ప్రాంతంలో ఉన్న జలాల్బాద్ కేంద్రంగా రాత్రి 11:47 సమయంలో భూకంపం ఏర్పాడింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అఫ్గన్‌లో ఇంతటి విషాదం నెలకొన్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ ఆ దేశ ప్రజలకు మద్దతుగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ‘అఫ్గనిస్థాన్‌లో సోదరులు, సోదరీమణులారా.. మీ భూభాగంపై వచ్చిన భూకంపం గురించి తెలిసి మా హృదయం ముక్కలైంది.
To our brothers and sisters in Afghanistan, we’re heartbroken by the earthquake that struck your land.
In this darkest hour, may strength and hope lift you again. pic.twitter.com/enaZTqDkj8
— Chennai Super Kings (@ChennaiIPL) September 1, 2025
ఈ కష్టకాలంలో మానసిక నిబ్బరం, ఆశతో మీరంతా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ప్రకృతి విలయానికి అల్లాడిపోయిన అఫ్గన్ ప్రజల గురించి దేవుడిని ప్రార్ధిస్తాం’ అని సీఎస్కే భూకంప తీవ్రతకు అద్దం పట్టే ఫొటో పోస్ట్‌లో వెల్లడించింది. ఐపీఎల్లో పలువురు అఫ్గన్ క్రికెటర్లు సీఎస్కే తరఫున ఆడారు. ప్రస్తుతం చెన్నై స్క్వాడ్‌లో యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఉన్నాడు.
ముక్కోణపు సిరీస్ సందర్భంగా అఫ్గనిస్తాన్, యూఏఈ క్రికెటర్లు భూకంప బాధితుల కోసం మైదానంలో మౌనం పాటించారు. అంతేకాదు తమ మ్యాచ్ ఫీజుతో పాటు విరాళంగా వచ్చిన సొమ్మును కునార్ రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు అందిస్తామని అఫ్గన్ ఆటగాళ్లు తెలిపారు.
AfghanAtalan Stand in Solidarity with Earthquake Victims in Kunar
Ahead of their match against the UAE, AfghanAtalan observed a minute of silence and recited Fatiha in memory of the victims of the devastating earthquake that struck Kunar province in eastern Afghanistan.
Kunar,… pic.twitter.com/MWrU4jCiGq
— Afghanistan Cricket Board (@ACBofficials) September 1, 2025
ఆఫ్గనిస్థాన్‌లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూకంపం (Afghanistan earthquake) సంభవించింది. కునార్ నాన్గర్హర్ ప్రాంతంలో భూమి 6.0 తీవ్రతతో కంపించింది. ఆ భూకంపం వల్ల సుమారు 800కు పైగా మృతిచెంది ఉంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కున్వార్లోనే 812 మంది చనిపోయినట్లు ప్రభుత్వ ప్రతినిధి మౌలావి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. సుమారు 3000 మందికిపైగా గాయపడ్డారు. నాన్గర్హర్ ప్రావిన్సులో ఉన్న జలాలాబాద్ సిటీకి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ, పర్వత ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, విరిగిపడిన కొండచరియలు రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగిస్తున్నాయి.