IPL 2023 : పవర్ ప్లేలో చెన్నై ఓపెనర్లు దంచారు. రుతురాజ్ గైక్వాడ్(30) సిక్సర్లతో చెలరేగాడు. అర్షద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో రెండు సిక్స్‌లు, రెండు బౌండరీలతో 20 పరుగులు రాబట్టాడు. అయితే.. పీయూష్ చావ్లా ఈ జోడీని విడదీశాడు. గైక్వాడ్‌ను ఔట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. దాంతో, తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆరు ఓవర్లకు చెన్నై వికెట్ నష్టానికి 55 పరుగులు కొట్టింది. డెవాన్ కాన్వే(18), అజింక్యా రహానే(3) ఆడుతున్నారు.
Piyush Chawla strikes in his very first delivery 😎
Ruturaj Gaikwad departs after a flying start 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/hpXamvn55U #TATAIPL | #CSKvMI pic.twitter.com/S3d661VdH2
— IndianPremierLeague (@IPL) May 6, 2023
సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు హడలెత్తించారు. దాంతో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై టాపార్డర్ విఫలమైంది. స్టార్ ప్లేయర్స్ విఫలం అయిన చోట నేహల్ వధేరా(64) సాధికార ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకంతో రాణించాడు. ట్సిస్టన్ స్టబ్స్(20)తో కలిసి ధాటిగా ఆడి ముంబై స్కోర్ వంద దాటించాడు. వీళ్లు ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్(26), ఇషాన్ కిషన్(7), రోహిత్ శర్మ(0), విధ్వంసక ఆటగాడు టిమ్ డేవిడ్(2) తక్కువకే ఔట్ కావడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. చెన్నై బౌలర్లలో మథీశ పథిరన మూడు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లు తీశారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.20 ఏళ్ల పథిరన 15 పరుగలిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో వ్యక్తిగతంగా ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.